ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి

447చూసినవారు
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సర్వే నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి నెలకొందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్