నాగార్జున సాగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రముఖ ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యచరణ చేపట్టిందని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో టూరిజం, ఆర్కియాలజీ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, వారసత్వ, జానపద సంపదలున్న నల్గొండ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో డేటా సేకరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.