లేఅవుట్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

3చూసినవారు
లేఅవుట్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన చాంబర్లో లే ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులు, తహసిల్దార్లతో లేఅవుట్లపై సమావేశం నిర్వహించారు. లేఅవుట్ ప్రక్రియ పనులను నియమ నిబంధనలకు లోబడి పారదర్శకంగా నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. లేఅవుట్లకు సంబంధించిన భూసేకరణ అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని, అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని స్పష్టం చేశారు. భూ రికార్డులు, డ్రైనేజీ, రోడ్డు మార్గాలు, నీటిపారుదల మార్గాలన్నీ శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :