విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులకు తెలిపారు. శనివారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాష్, అండర్ సెక్రెటరీ అభిషేక్ బీస్వాల్ , వసీం ఇక్బాల్ ల బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో ఒక రోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ను జిల్లా కలెక్టర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.