మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజుల మహనీయుల జయంతి ఉత్సవాలను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. శుక్రవారం మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారి స్ఫూర్తిని ప్రతిబింభించేలా వివిధ కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని గడియారం కూడలిలోని పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.