ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది

2చూసినవారు
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది
మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదని, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయామన్న భావనలో ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :