రిజర్వేషన్లు, నామినేషన్లకు మధ్య తక్కువ సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా, లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రతి వార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే వార్డుల వారీగా ఆశావాహుల జాబితాను రూపొందించే పనిలో పడ్డాయి.