గంజాయి వ్యాపారంతో పాటు రాత్రి వేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తూ వచ్చిన ఓ ముఠాను నార్కట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారుగా రూ. 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి, నగదు, గంజాయి మరియు ఒక బైక్‌ను రికవరీ చేశారు. అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక మహిళ ఉన్నారు.