రేపటి యూజీ పరీక్ష కేంద్రం మార్పు: విద్యార్థులు గమనించాలి

749చూసినవారు
రేపటి యూజీ పరీక్ష కేంద్రం మార్పు: విద్యార్థులు గమనించాలి
నల్గొండ ఎన్జీ కళాశాలలో జరగాల్సిన అంబేద్కర్ వర్సిటీ యూజీ నాలుగో సెమిస్టర్ ఐదో పరీక్షను రేపు నల్గొండ ఉమెన్స్ కళాశాలకు మార్చినట్లు నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఎన్జీ కళాశాలలో సీఎం బహిరంగ సభ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష రాసే విద్యార్థులు ఈ మార్పును గమనించాలని, మిగిలిన పరీక్షలు యధావిధిగా ఎన్జీ కళాశాలలోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షకు హాజరుకావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్