ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్టీఎఫ్ హర్షం.

7చూసినవారు
ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్టీఎఫ్ హర్షం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏటా జరిగే రెండు సాధారణ టెట్లతో పాటు, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం మరో రెండు ప్రత్యేక టెట్‌లు నిర్వహించడానికి అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిస్తుందని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ పేర్కొంది. 31 ఆగస్టు, 2028 లోగా ఇన్-సర్వీస్ టీచర్లందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని అపెక్స్ కోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో, ఈ గడువును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అందరినీ కలుపుకుపోతామని తెలిపింది.

సంబంధిత పోస్ట్