రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే 'టీఎస్ ఐసెట్-2026' పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష బాధ్యతలను ఉన్నత విద్యా మండలి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అప్పగించింది. ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సీనియర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి టీఎస్ ఐసెట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని పలు కళాశాలల్లో ప్రవేశాలు కల్పించబడతాయి.