నకిరేకల్ పట్టణంలో బుధవారం టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహసభ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అద్యక్షుడు గార్లపాటి క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మహాసభకు ప్రతి మండలం, పట్టణం నుంచి జర్నలిస్ట్‌లు తరలి రావాలని కోరారు. జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం నిరంతరం కృషి చేసే ఏకై క సంఘం ఐజేయు అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.