నేరేడుచర్ల పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు తవుడోజు అనుష (28) తన మేనమామ ఇంట్లో నివాసం ఉంటుండగా, SS రెడీమేడ్ బట్టల షాపులో పనిచేస్తున్న సమయంలో నన్నే పంగు మధు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా అనుష వేరొకరితో మాట్లాడుతోందని అనుమానిస్తూ మధు ఆమెను వేధిస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. ఈ వేధింపులు తట్టుకోలేక అనుష ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొన్నారు.