నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో బుధవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. విద్యార్థులు తమ సమస్యలను నేరుగా చర్చించే ప్రజాస్వామిక వాతావరణం ఉందని, సమస్యలు దృష్టికి రాగానే పరిష్కరిస్తామని వీసీ తెలిపారు. మెస్సులు విద్యార్థులు నిర్వహిస్తున్నందున, అపోహలు నివారించడానికి లైసెన్స్ కలిగిన వ్యాపార సంస్థల నుండే వస్తువులు కొనుగోలు చేయాలని విద్యార్థులు తీర్మానించి అధికారులకు సంతకాలు చేశారు.