
మళ్లీ పెళ్లి పీటలెక్కనున్న ఆమిర్ ఖాన్!
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (61) తన భాగస్వామి గౌరీ స్ప్రాట్ (47)ను జులై 5న వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ముంబైలోని ఆమిర్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం ప్రైవేట్ రిజిస్టర్ మ్యారేజ్ రూపంలో జరగనుంది. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. గౌరీకి గతంలో వివాహం జరగ్గా.. ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమిర్ ఖాన్కు ఇది మూడో వివాహం. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులను వివాహం చేసుకున్నారు.




