జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గురువారం జిల్లాలోని కొన్ని కేంద్రాలలో అకాల వర్షానికి ధాన్యం తడిసిందని, అయితే అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. తిప్పర్తి మండలం పజ్జూరులో 650 బస్తాలు, కనగల్ మండలం లచ్చు గూడెంలో 1800 బస్తాలు, తిప్పర్తి మండలం కేశ రాజు పల్లి లో 100 బస్తాలు వర్షానికి తడిచిపోగా వాటిని కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు పంపించామని ఆయన పేర్కొన్నారు.