పోరాడి తెలంగాణ సాధించుకున్నాం

1చూసినవారు
పోరాడి తెలంగాణ సాధించుకున్నాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌ అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రవీంద్రకుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్లాక్‌ టవర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద, శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్