గుడిపల్లి మండలంలోని కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌లోని మెయిన్ పంపులో నుంచి నాచు, బురదతో కూడిన నీరు వస్తోందని బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆరోపించారు. పీఏపల్లి, గుడిపల్లి మండలాల్లోని నివాసాలకు నెల రోజులుగా మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదని ఆయన తెలిపారు. మంగళవారం కోదండాపురం ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన, సంప్‌హౌస్‌ను ఆరు నెలలకోసారి శుభ్రం చేస్తారని ఇన్‌చార్జి చెప్పడంతో, ఇది ప్రజలు తాగే నీరేనా అని ప్రశ్నించారు.