నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా
కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ, డిండి, నక్కల గండి ప్రాజెక్టులు నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అని గుర్తు చేసిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తన అహంకారంతోనే ఈ ప్రాజెక్టులను పక్కనబెట్టి, జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.