జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశాల మేరకు, మండల ప్రత్యేక అధికారులు మండలాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలి. ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి. రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, విద్యాసంస్థలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇటీవల ఆడపిల్లల విషయంలో జరుగుతున్న సంఘటనలు, బాల్యవివాహాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ సూచించారు.