ఆటో నుంచి జారిపడి మహిళ మృతి

3చూసినవారు
ఆటో నుంచి జారిపడి మహిళ మృతి
చెర్వుగట్టుకు వెళ్లి, రాత్రి బస చేసి మంగళవారం మధ్యాహ్నం తిరిగి ఇంటికొస్తుండగా, సంస్థన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన నందిపాటి మల్లమ్మ ఆటో నుంచి జారిపడి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఆటో ఆమె కాలు మీద నుంచి పోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్