మెడికల్ కాలేజీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

0చూసినవారు
మెడికల్ కాలేజీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ సూచన మేరకు మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆరోగ్య శిక్షణ కేంద్రంలో పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 'టుగెదర్ ఫర్ హెల్త్-స్టాండ్ విత్ సైన్స్' నినాదంతో లైన్వాడ హెల్త్ సెంటర్ వద్ద మెడికల్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్