బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి యువకుడు దుర్మరణం

3చూసినవారు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి యువకుడు దుర్మరణం
నల్గొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగల్ మండలం పొనుగోడుకి చెందిన బండమీది శ్రీను (25) మృతి చెందారు. శ్రీను తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కల్వర్టులో పడిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్నవారు మృతదేహాన్ని గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్