యువత మంచి మార్గంలో నడవాలి

2చూసినవారు
యువత మంచి మార్గంలో నడవాలి
నల్గొండ జిల్లా పానగల్‌లో కౌండిన్య యువ దళం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ టూ టౌన్ ఎస్ఐ ఎర్ర సైదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన సూచించారు. యువత తమ శక్తిని మంచి దిశగా మలిస్తే సమాజంలో గొప్ప మార్పులు తీసుకురాగలరని, పానగల్ యువత సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కౌండిన్య యువ దళం సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్