చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా, ఆలయ గోపురంపైకి చేరిన ఓ వానరం జెండాను పైకి ఎత్తిపట్టుకున్న అరుదైన దృశ్యం భక్తులను పరవశింపజేసింది. సాక్షాత్తు హనుమంతుడే రామయ్య చెంతకు వచ్చినట్లుగా భావించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.