Apr 12, 2026, 14:04 IST/
ఇంటర్ ఫలితాల్లో తప్పడంతో మనస్తాపం: విద్యార్థిని ఆత్మహత్య
Apr 12, 2026, 14:04 IST
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండ మీది చందు పట్ల గ్రామంలో ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో సబ్జెక్టు తప్పినందున మనస్థాపానికి గురైన ఎడ్ల మౌనిక (16) అనే విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. ఈ సంఘటన మధ్యాహ్నం చోటుచేసుకుంది.