నల్గొండ రేంజ్ పరిధిలోని ఏసీబీ కార్యాలయం చిరునామా మారింది. నల్గొండలోని పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని పాత R&B కార్యాలయానికి ఈ ఆఫీసును మార్చినట్లు అధికారులు ప్రకటించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ప్రజలు అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు కొత్త కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1064, క్యూఆర్ కోడ్ ద్వారా సమాచారం అందించాలని డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు.