నల్గొండ డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన

నల్గొండ డిపో ఆర్టీసీ ఉద్యోగులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, జూన్ 2, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి అపాయింట్‌మెంట్ డేట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. TGRTC-JAC పిలుపు మేరకు ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
