
సూర్యాపేట: వార్షిక పరీక్షల్లో నూరు ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, పదవ తరగతి వార్షిక పరీక్షలకు ప్రణాళిక ప్రకారం బాగా చదివి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. గురువారం నాగారం మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ ఎస్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి, పదవ తరగతి విద్యార్థుల నోట్ బుక్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర చారి పాల్గొన్నారు.








































