రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10న కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు (పి.డి.ఎస్.యు-ఎస్ఎఫ్ఐ) పిలుపునిచ్చాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘాల నాయకులు మాట్లాడుతూ, 24 వేల పాఠశాలలను 4 వేలకు కుదించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని వారు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.