మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి హుజూర్‌నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మునగాల మండలంలో రోడ్లు, భవనాలు, తాగునీటి, పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రామన్నగూడెం చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.