35 ఏళ్ల సుదీర్ఘ సేవలు.. పదవీ విరమణ చేసిన TGVB మేనేజర్ రాజ్యలక్ష్మి

1చూసినవారు
35 ఏళ్ల సుదీర్ఘ సేవలు.. పదవీ విరమణ చేసిన TGVB మేనేజర్ రాజ్యలక్ష్మి
నల్గొండ జిల్లా చిట్యాలలోని వెలిమినేడు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ ఆర్పీఆర్ రాజ్యలక్ష్మి 35 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేశారు. గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. 1991లో మంజీరా గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా చేరిన రాజ్యలక్ష్మి స్కేల్-3 మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు. కస్టమర్లతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పేదలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆమె చేసిన కృషిని పలువురు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్