Feb 10, 2026, 17:02 IST/
ఓపెన్ డ్రెయిన్లో పడి వ్యక్తి మృతి (వీడియో)
Feb 10, 2026, 17:02 IST
ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 32లో అధికారుల నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. మహాశక్తి కాళీ ఆలయం సమీపంలో తెరిచి ఉన్న భారీ డ్రైనేజీ కాలువలో పడి 32 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా, కాలువపై మూత లేకపోవడంతో ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.