తిప్పర్తి మండలం - Thipparthi Mandal

నల్గొండ జిల్లా
చండూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
Mar 24, 2026, 15:03 IST/మునుగోడు నియోజకవర్గం
మునుగోడు నియోజకవర్గం

చండూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

Mar 24, 2026, 15:03 IST
చండూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ చండూరు పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓ పద్మకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మోడల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరహాలో చండూరులో కూడా అధునాతన సదుపాయాలతో కూడిన పాఠశాల ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపార్టీ సతీష్, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.