TG: పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నల్లవెల్లి శంకర్ ను మరోసారి నియమించారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేస్తానని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామని తెలిపారు.