
బిహార్ సీఎంగా మరోసారి నితీష్ కుమార్!
బిహార్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, జేడీయూ కూటమి మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో కేబినెట్ ఫార్ములాను ఖరారు అయింది. మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూటమి వర్గాలు తెలిపాయి. అయితే బీజేపీ తరఫున ఉప ముఖ్యమంత్రిని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.




