అయోధ్య రామాలయ నిర్వహణ కోసం నియమించనున్న తొలి పూర్తికాల సీఈవో పేరును శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం ఖరారు చేయనుంది. ఈ పదవి కోసం దేశవ్యాప్తంగా వచ్చిన 5,585 దరఖాస్తులను పరిశీలించిన ఎంపిక కమిటీ.. తుది దశలో ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసి ట్రస్టుకు సమర్పించింది. 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. రిటైర్డ్ ఉన్నతాధికారులు కూడా తుది జాబితాలో ఉన్నట్లు సమాచారం. ట్రస్టు సమావేశంలో సీఈవోతోపాటు కొత్త ప్రధాన కార్యదర్శి, సభ్యుల నియామకంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.