శివుడి తలపై నందీశ్వరుడు... ఈ విచిత్రం వెనుక రహస్యమేంటో తెలుసా?

2చూసినవారు
బెంగళూరులో ఉన్న నంది తీర్థ క్షేత్రం ఓ ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నంది శివుడికి ఎదురుగా కాకుండా.. ఆలయంలో శివలింగం పైన కొలువై ఉంటుంది. నంది నోటి నుంచి నిరంతరం వచ్చే జలం నేరుగా శివలింగంపై పడుతూ అభిషేకం చేస్తుంది. 1997లో పురావస్తు తవ్వకాల సమయంలో భూగర్భంలో ఈ ఆలయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అప్పటినుంచి నంది నోటి నుంచి జలధార కొనసాగుతుండటం విశేషం. ఈ నీటి మూలం ఏమిటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. దీంతో భక్తుల్లో ఈ క్షేత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్