నంది అవార్డు గ్రహీత లక్ష్మీ కన్నుమూత

20చూసినవారు
నంది అవార్డు గ్రహీత లక్ష్మీ కన్నుమూత
AP: భీమవరానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారిణి, నంది అవార్డు గ్రహీత భీమవరం లక్ష్మీ (61) గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు దశాబ్దాలకు పైగా రంగస్థలంపై నటిగా సేవలందించిన ఆమె అనేక సాంఘిక, పౌరాణిక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ప్రముఖ నాటకాలైన కలహకంటిక, వసంత, రాధ, మాతంగ వంటి పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. మూడు నంది అవార్డులు అందుకున్న లక్ష్మీ, సహనటులతో స్నేహపూర్వకంగా ఉండేవారని రంగస్థల కళాకారులు గుర్తుచేశారు. ఆమె మృతితో రంగస్థల ప్రపంచంలో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్