నాని 'ది ప్యారడైజ్' వాయిదా?

0చూసినవారు
నాని 'ది ప్యారడైజ్' వాయిదా?
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మొదట మార్చి 26న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా, షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త టీజర్‌తో పాటు కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. అభిమానులు మాత్రం కాస్త ఆలస్యమైనా మంచి విడుదల తేదీని ప్రకటించాలని కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్