
గ్యాస్ సబ్సిడీకి బయోమెట్రిక్ ఆధార్ తప్పనిసరి: కేంద్రం
అక్టోబర్ 1 నుంచి గృహ ఎల్పీజీ వినియోగదారులు గ్యాస్ సబ్సిడీ పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి సబ్సిడీ నిలిచిపోయి, సిలిండర్ కోసం పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 27.43 కోట్ల మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మొబైల్ యాప్ ద్వారా లేదా గ్యాస్ ఏజెన్సీని సందర్శించి ఈ-కేవైసీ చేసుకోవచ్చు. సందేహాల నివృత్తికి 1800 2333 555 హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉంది.




