నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన 'ది ప్యారడైజ్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ, 'దసరా'తో తనకు జీవితం ఇచ్చిన నాని, ఈ చిత్రంలో జడల్ పాత్రలో అద్భుతంగా నటించారని తెలిపారు. మోహన్ బాబు ప్రధాన విలన్గా నటించారని, ఆయన, నాని మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయని చెప్పారు.