
భారత్ వైపు కదులుతున్న దిత్వా తుఫాన్
దిత్వా తుఫాన్ భారత్ వైపు దూసుకువస్తోంది. ప్రస్తుతం గంటకు 5 కి.మీ. వేగంతో కదులుతున్న ఈ తుఫాన్, చెన్నైకి 250 కి.మీ. దూరంలో, పుదుచ్చేరికి 160 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 30న పుదుచ్చేరి తీరాన్ని తాకనుంది. ఈ తుఫాన్ కారణంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.




