యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

9165చూసినవారు
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రిని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం, శేష వస్త్రం బహూకరించారు. వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్