కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సర్వే ప్రారంభించింది. బెంగళూరు జయానగర్‌లోని నారాయణమూర్తి నివాసానికి సిబ్బంది వెళ్లినా, ఆయన దంపతులు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారు. తాము వెనకబడిన వర్గానికి చెందినవాళ్లు కాదని, సర్వే అవసరం లేదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, సర్వే పూర్తిగా స్వచ్ఛందంగా జరుగుతుందని, ఎవరినీ బలవంతం చేయమని తెలిపారు.