
భారీ వరదలు.. నాసిక్‌లో ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి(వీడియో)
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి నాసిక్‌లోని గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే రామ్‌కుండ్ సహా పలు ఘాట్లు, ఆలయాలు నీటిలో మునిగాయి. పలు డ్యామ్‌లలోకి భారీగా నీరు చేరుతోంది. నది ఒడ్డున ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. కాగా ఎగువన వరదలతో గోదావరి నడి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో కిందనున్న TGలోని రైతులకూ మేలు కలుగనుంది.






























