నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన 68 ఏళ్ల మహిళ, థైరాయిడ్, ఆస్తమా సమస్యలతో బాధపడుతుండటంతో పలువురు వైద్యులు శస్త్రచికిత్సకు నిరాకరించారు. శుక్రవారం అచ్చంపేటలోని ఓ ఆసుపత్రి వైద్యులు ఆమెకు గర్భాశయ తొలగింపుతో పాటు 10x9 సెం.మీ. అండాశయ సిస్టును విజయవంతంగా తొలగించారు. రోగి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని, వైద్యుల కృషిని అభినందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.