అలంపూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నికల ఖర్చుపై అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో, స్థానిక మున్సిపల్ కమిషనర్ శంకర్, రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచారాలు ఊపందుకున్నాయి.