గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి చెందిన చిన్నారి యామిని ఆరేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న ట్రైనింగ్ ఆప్కారి ఎస్సై పరశురాం, వివిధ దాతల నుంచి రూ.40,500 సేకరించి, కర్నూల్ లోని విశ్వభారతి క్యాన్సర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారి కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. ఈ సహాయంతో ఆ కుటుంబం పరశురాం కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో దాతలు జెసిబి వెంకటేష్, రంగస్వామి కూడా పాల్గొన్నారు.