ర్యాలoపాడులో ఉచిత పశువైద్య శిబిరం: 30 పశువులకు పరీక్షలు

212చూసినవారు
ర్యాలoపాడులో ఉచిత పశువైద్య శిబిరం: 30 పశువులకు పరీక్షలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని ర్యాలoపాడు గ్రామంలో 30-01-2026, శుక్రవారం నాడు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరాన్ని సర్పంచ్ MD రఫి ప్రారంభించారు. ఈ శిబిరంలో 30 పశువులకు గర్భకోశ పరీక్షలు చేసి మందులు అందించారు. 75 లేగదూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చి, 12 సాధారణ చికిత్సలు చేశారు. గొర్రెలు, మేకలకు అమ్మ తల్లి/బొబ్బ రోగo టీకాలు, 660 జీవాలకు టీకాలు వేశారు. పశుసంపద అభివృద్ధి ద్వారా రైతు కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయని సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట్ నారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్